కరోనాతో పోరాడుతూ చనిపోతున్న డాక్టర్లు, నర్సులను చూస్తే అందంగా వుందన్న ట్రంప్

శుక్రవారం, 15 మే 2020 (17:36 IST)
కరోనాపై పోరాడుతున్న డాక్టర్‌లు, నర్సులకు ప్రపంచ దేశాలు జేజేలు కొడుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ తొడుగుల కొరత ఏర్పడిందని మీడియాలో కథనం వచ్చింది. దీనిపై జరిగిన సమావేశంలో ట్రంప్ డాక్టర్‌లు, నర్సులను ఉద్దేశించి అన్న మాటలకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
యుద్ధంలో పోరాడుతూ బుల్లెట్ గాయాలు తగిలి నేలకొరిగిన సైనికుల వలే డాక్టర్లు, నర్సులు కరోనాతో పోరాడుతూ చనిపోతున్నారని, ఇది చూడటానికి చాలా అందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కొంతమందికి తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో కూడా దీనిపై విమర్శలు భారీగానే వస్తున్నాయి. 
 

Trump says doctors and nurses are "running into death just like soldiers running into bullets" and that "it's a beautiful thing to see." pic.twitter.com/UEHUi3gIhT

— The American Independent (@AmerIndependent) May 14, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు