లడఖ్ నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యతో భారత సైన్యం అప్రమత్తమైంది. . చైనా యుద్ధ విమానాల పెట్రోలింగ్‌తో భారత వాయుసేన పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను లడఖ్‌లో మోహరించింది. ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ యుద్ధ విమానాల పెట్రోలింగ్ నేపథ్యంలో.. భారత్ విషయంలో చైనా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.