టైగ్రిస్ నది ఎండిపోయిన భాగంలో కనిపించిన ఈ స్థావరాన్ని.. కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ 1550 - క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం.. కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
జర్మనీ పురావస్తు బృందంలోని డా.ఇవాన పుల్జిజ్ ఓ ప్రకటనలో స్పందిస్తూ, 'ఈ నగరం నేరుగా టైగ్రిస్‌లో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాన్ని(ప్రస్తుతం ఈశాన్య సిరియాలో ఉంది).. దాని తూర్పు ప్రాంతంతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు' అని పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పురాతన నగరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకుగానూ దాన్ని పూర్తిగా ప్లాస్టిక్ షీట్‌లతో కప్పారు. మట్టి గోడలను, శిథిలాల్లో దాగి ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.