దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురికాగా, వారిలో 80 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 200 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి వెళ్లారని మంత్రి వివరించారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కాగా, కంపెనీ నుంచి లీకైన వాయువును అమ్మోనియా గ్యాస్ గా భావిస్తున్నారు.