ఈఫిల్ టవర్‌పై నిద్రపోయారు.. ఎలా.. ఎందుకని?

బుధవారం, 16 ఆగస్టు 2023 (09:25 IST)
పీకలవరకు మద్యం సేవించిన కొందరు పర్యాటకులు ఈజిప్టులోని ఈఫిల్ టవర్ ఎక్కి నిద్రలోకి జారుకున్నారు. వీరంతా అమెరికా దేశానికి చెందిన టూరిస్టులు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరుగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. కిందకు వచ్చే సమయంలో సిబ్బందిని బురిడీ కొట్టించి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి ఈ పనికి పాల్పడ్డారు. తాగిన మైకంలో గందరగోళానికి గురై తిరిగి కిందకురాలేక అక్కడే నిద్రపోయారు. మరుసటిరోజు సెక్యూరిటీ సిబ్బంది గాఢనిద్రలో ఉన్న పర్యాటకులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సోమవారం ఉదయం 9.00 గంటలకు సందర్శకులను టవర్‌పైకి పర్యాకులను అనుమతించే ముందు సిబ్బంది అక్కడ తనిఖీలు నిర్వహించారు. అపుడు టవర్ రెండు, మూడు అంతస్తుల మధ్య పర్యాటకులకు అనుమతి లేని ప్రాంతంలో నిద్రపోతున్న అమెరికా టూరిస్టులను సిబ్బంది గుర్తించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కిన వారు ఆ రాత్రి అక్కడే చిక్కుకునిపోయి ఉంటారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు. భద్రతా సిబ్బందిని బురిడీ కొట్టించి వారు ఐఫిల్ టవర్పైకి ఎక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 
ఆదివారం రాత్రి టవర్‌ను చూసేందుకు వారు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే, కిందకు వచ్చే క్రమంలో వారు సిబ్బంది కళ్లుకప్పి అక్కడున్న బేరియర్లను దాటుకుని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లారు. చివరకు కిందకు ఎలా రావాలో తెలీక అక్కడే రాత్రంతా గడిపారు. అత్యవసర సిబ్బంది సాయంతో వారిని జాగ్రత్తగా కిందకు దింపిన అనంతరం, ప్యారిస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు