బూడిద కుప్పగా మారిన హవాయి ద్వీపం.. 70మంది మృతి

శనివారం, 12 ఆగస్టు 2023 (22:31 IST)
Hawaii fire
హవాయి ద్వీపం బూడిద కుప్పగా మారిపోయింది. హవాయి దీవుల్లోని లహైనా నగరాన్ని కార్చిచ్చు దహించి వేసింది. నగరంలోని ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఇప్పటివరకు ఈ కార్చిచ్చు దాదాపు 70 మృతదేహాలను గుర్తించారు. 
 
శతాబ్ధాల చరిత్ర కలిగి, భూతల స్వర్గంగా పేరుగాంచిన హవాయి ద్వీపంలో ఎటు చూసినా కాలిపోయిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. హరికేన్ ప్రభావంతో బలమైన గాలుల కారణంగా మంటలు క్షణాల్లో నగరమంతా విస్తరించాయి. 
 
మంగళవారం రాత్రి ఈ కార్చిచ్చు నగరమంతా విస్తరించింది. కార్చిచ్చు కారణంగా వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. హవాయి చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద విపత్తు అని అధికారులు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు