భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు.
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.