ముగ్గురు మహిళలతో మస్క్‌కు పది మంది పిల్లలు... గ్రిమ్స్‌కు మూడో సంతానం

ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (14:51 IST)
అపర కుబేరుడు, టెస్లా కంపెంనీ అధినేత, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌ మరో ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. తన మూడో భార్య నర్ గ్రిమ్స్‌కు తనకు మూడో సంతానం ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భార్యల ద్వారా ఆయన పది మంది పిల్లలకు జన్మనిచ్చారు. అంటే పదిమంది సంతానం ఉందన్నమాట. 
 
నిజానికి గ్రిమ్స్‌కు మస్క్‌కు ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని తెలుసు. కానీ, తాజాగా తమ మూడో సీక్రెట్ సంతానం గురించి ఇప్పుడు వెల్లడించారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ బయోగ్రఫీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఇందులో మస్క్, గ్రిమ్స్ వారి మూడో సంతానాన్ని చూపెట్టారు. 
 
మూడో సంతానమైన కొడుకు పేరు టెక్నో మెకానికస్ అని చెప్పారు. అయితే అతని గురించి అంతకు మించి వివరాలు తెలియలేదు. ఎప్పుడు పుట్టాడు? తదితర వివరాలు ఎవరికీ తెలియదు. ముగ్గురు మహిళలో మస్క్‌కు 10 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు భార్యలు (జస్టిన్ విల్సన్, తలులా రిలే) కాగా... గ్రిమ్స్‌తో ఆయన మూడేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అప్పటి నుంచి యేడాదికి ఒకరు చొప్పున పిల్లలను కంటూనే ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు