చైనాకు షాక్.. ఫేస్‌బుక్ ఖాతాలను నిలిపేస్తున్నాం.. కంటెంట్ పరిమాణం..

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:22 IST)
చైనాకు షాకుల మీద షాకులు తప్పట్లేదు. ఇప్పటికే 118 చైనా యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా, అమెరికన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న చైనా ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించినట్లుగా ఫేస్‌బుక్ తెలిపింది. 
 
వీటిలో కొన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అలాగే వ్యతిరేకిస్తున్న పోస్ట్‌లు చేస్తున్నాయి. ఆరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో పాటు ఫేస్‌బుక్ ప్లాట్‌ ఫాంపై 155 ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో ఎక్కువగా వీటిని వాడుతున్నారని గుర్తించారు. యుఎస్ ఖాతాల్లో తక్కువ మంది ఫాలోవార్లు ఉన్నారు. 
 
ఫేస్‌బుక్ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ చీఫ్ నాథనియల్ గ్లీచెర్ మాట్లాడుతూ, అమెరికా రాజకీయాల్లో ఏదైనా ప్రణాళికతో విదేశీ జోక్యం ఉంటే… కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 'కంటెంట్ పరిమాణం చాలా తక్కువగా ఉంది, వారి లక్ష్యం ఏమిటో అంచనా వేయడం చాలా కష్టమని గ్లీచెర్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు