గత రెండు దశాబ్దాల కాలంలో తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన, శిక్షలు విధించిన మహిళా జడ్జీల కోసం తాలిబన్ తీవ్రవాదులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇలాంటివారిలో ఇప్పటికే అనేక మంది దేశాన్ని వీడిపోయారుకూడా. మిగిలిన వారు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ దొంగచాటుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారంతా రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.