ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ దేశంలో అల్లకల్లో పరిస్థితులు నెలకొనివున్నాయి. తాలిబన్ల పాలనలో ఉండలేమని భావించిన అనేక మంది దేశం వీడి పోతున్నారు. ఇలాంటి వారితో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. కాబూల్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరుగొచ్చంటూ అమెరికా నిఘా సంస్థ హెచ్చరించి 24 గంటలు తిరగకముందే రాకెట్ దాడి జరిగింది.
ఈ దాడితో అక్కడ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్‌లో ఇంకా కొంత మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా వెళ్లాక ఆఫ్ఘన్‌లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన నెలకొంది.