పుతిన్‌కు ఘోర అవమానం.. మహిళలకు పువ్వులిస్తే..?

గురువారం, 10 మార్చి 2022 (13:46 IST)
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘోర అవమానం.. అదీ సొంత గడ్డపైనే జరిగింది. మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా పుతిన్‌ లక్ష పువ్వుల పంపకం ఈసారి బెడిసి కొట్టింది. 
 
వాలంటీర్ల సాయంతో మాస్కో నగరంలో మహిళలకు లక్ష పువ్వుల్ని పంచడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం. మహిళా డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వాలంటీర్ల సాయంతో పూలు పంచాలంటూ అధ్యక్ష భవనం నుంచే ఈ ఆదేశాలు వెలువడుతుంటాయి. 
 
అయితే.. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చాలామంది పువ్వుల్ని తీసుకోవడానికి నిరాకరించారట. పువ్వులతో పాటు ఫ్లవర్‌ బొకేలను సైతం తిరస్కరించారట. అంతేకాదు కొన్నిచోట్ల వాటిని చెత్త కుప్పల్లోనే పడేసిన దృశ్యాలు సైతం వైరల్‌ అయ్యాయి. 
 
సోషల్‌ మీడియాలో పుతిన్‌ యుద్ధకాంక్షను ఛీ కొడుతూ.. ఆ వ్యతిరేకత తారాస్థాయిలో కనిపించింది. దీంతో ఆ పోస్టులు, ఫొటోల్ని తొలగించాలని రష్యన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు