లండన్‌లో వర్టికల్ ఫార్మింగ్.. గంటల్లో తాజాగా సలాడ్స్ చేసుకోవచ్చు..

శుక్రవారం, 2 డిశెంబరు 2022 (15:10 IST)
vertical farming
"వర్టికల్ ఫార్మింగ్" లండన్‌లో ప్రజాదరణ పొందుతోంది. భూమి నుండి 100 అడుగుల దిగువన ఈ వ్యవసాయం చేస్తారు. తక్కువ మొత్తంలో నీరు, ఎరువులతో మొక్కలు వృద్ధి చెందుతాయి. ఈ వ్యవసాయం కోసం బంకర్లు నేలమాళిగలుగా మార్చబడతాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో నిర్మించిన గనిలో వ్యవసాయ పనులు జరుగుతాయి. 
 
ఇందులో భాగంగా జీరో కార్బన్ ఫార్మ్స్ సౌత్ లండన్‌లోని క్లాఫామ్‌లో మూలికలు, సలాడ్‌లను పెంచుతోంది, సంప్రదాయ వ్యవసాయానికి స్థలం లేని జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో వర్టికల్ ఫార్మింగ్ లండన్‌కు కలిసొచ్చింది.
 
కొనుగోలుదారులు ఉత్పత్తుల్లో తాజాదనాన్ని ఇష్టపడతారు. ఈ వర్టికల్ ఫామింగ్ ద్వారా ఇది పంట కోసిన రెండు గంటలలోపు డైనర్స్ ప్లేట్‌లోకి చేరుతుంది. గంటలపాటు జర్నీ చేయకుండా.. గంటల్లో షాపుల్లోకి వెళ్తుంది. ఈ వర్టికల్ వ్యవసాయానికి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు