లండన్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రాలో ఇదివరకే మూడు పాటలకు సంబంధించిన ఆర్కెస్ట్రైజేషన్ చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తయ్యాయి. ఆ పాటలు విన్న తర్వాత మిగిలిన పాటలకు సంబంధించిన పనులను బెడపెస్ట్ సింఫనీలో చేస్తే అంతే గొప్ప క్వాలిటీ వస్తుందని సంగీత దర్శకుడు, దర్శకుడు అనుకున్నారు.
విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు పిల్లలపై పెడుతున్న ప్రెజర్, నిర్విరామంగా సాగుతున్న చదువుకునే గంటలు వంటివాటిని ప్రస్తావించే చిత్రమిది. కళలకు, ఇతర వ్యాపకాలకు అసలు టైమ్ లేకుండా చేసి ఇంజనీర్లు, డాక్టర్లుగా మార్చడానికి విద్యార్థులను ఎలా రుబ్బుతున్నారో చెప్పే చిత్రమిది.
శ్రియా శరణ్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, సుహాసిని మూలే, బెంజమిన్ గిలాని, గ్రేసీ గోస్వామి, ఓజు బరువా కీలక పాత్రల్లో నటించారు. ఏస్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన కిరణ్ డియోహాన్స్ కెమెరామేన్‌గా పనిచేశారు.