#TrumpKimSummit : యుద్ధ నేపథ్య వేదికపై ట్రంప్ - కిమ్ చర్చలు.. ఎలా?

మంగళవారం, 12 జూన్ 2018 (12:24 IST)
అమెరికా, ఉత్తరకొరియా అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ శిఖరాగ్ర సదస్సు మంగళవారం జరిగింది. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ భేటీ ఎంతో ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదకరంగా సాగింది. ఈ చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సుకు వేదికగా సింగపూర్‌లోని సెంతోసా అనే దీవిలోని రిసార్టు కేపెల్లా.
 
నిజానికి సెంతోసా అనే ప్రాంతానికి చరిత్ర పుటల్లో మంచి పేరుంది. సెంతోసా అనేది మలై (మలేసియా) పదం. ఇది సంస్కృతం నుంచి వచ్చింది. దీనికి తెలుగులో అర్థం సంతోషం. మలైలో ప్రశాంతత, నిర్మలత, ఆనందం అని మూడు అర్థాలు చెబుతారు. 
 
సెంతోసా దీవిలోనే ఫోస్టెర్ కేపెల్లా రిసార్టు (హోటల్) ఉంది. ఇది సింగపూర్‌లోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైనది. ఇది ఒకప్పుడు బ్రిటిష్‌ సైనికదళాల మెస్‌. ఫిరంగి దళం దీన్ని వినియోగిస్తూ వచ్చింది. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది రిసార్టు‌గా మార్చారు. అంటే యుద్ధ నేపథ్యం ఉన్న వేదికపై ఈ శాంతి చర్చలు జరిగాయన్నమాట. 
 
మరి చరిత్రాత్మకంగా యావత్ప్రపంచం భావిస్తున్న ఈ వేదిక ఆ ప్రదేశానికి తగ్గట్లుగా సంతోషాన్ని ఈ ప్రాంతానికి, ప్రపంచానికి అందిస్తుందా? కొరియన్‌ ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర-రహితంగా, శాంతియుతంగా మల్చడానికి ఒక బాట ఏర్పరుస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

 

WATCH: Trump and North Korean leader Kim Jong Un shake hands at start of #TrumpKimSummit. Follow live updates: https://t.co/IgIU4Ln2S8 pic.twitter.com/MhXKn0eRmr

— Reuters Top News (@Reuters) June 12, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు