Havish, Kavya Thapar, Nakkina Trinadharao
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ - నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. మిక్కీ, ప్రవీణ్, నిజార్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా మూవీకి వర్క్ చేశారు. నేను రెడీ సినిమాతో సూపర్ హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటున్నా అన్నారు.