ఫాక్స్‌న్యూస్ తాజా సర్వేలో ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం ఓట్లొచ్చాయి. వారం క్రితం 3 శాతం ఆధిక్యంతో ఉన్నారు. మూడు వారాల క్రితం 6 శాతం ఆధిక్యంతో ఉన్నారు. ఎఫ్‌బీఐ దర్యాప్తులతో హిల్లరీ ఆత్మరక్షణలో పడ్డారని సర్వేయర్లు తేల్చారు. సీఎన్‌ఎన్ తాజా సర్వేలో హిల్లరీకి 268 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు వస్తాయని ప్రకటించింది.
విజయం ఖాయం కావాలంటే 270 తప్పనిసరి. ట్రంప్‌కు 204 ఓట్లు మాత్రమే వస్తాయని సీఎన్‌ఎన్ తేల్చింది. అన్ని సర్వేల్లో సగటున 1.6 శాతం హిల్లరీకి ఆధిక్యం ఉంది. ఆమె గెలిచే అవకాశాలు 67.8 శాతం ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ చెప్పగా, హ ఫింగ్టన్ పోస్టు దానిని 97.9 శాతంగా అంచనా వేసింది.