వామ్మో.. 48 దేశాలు సముద్రంలో మునిగిపోతాయా? అప్రమత్తంగా ఉండాలా?

బుధవారం, 14 డిశెంబరు 2016 (14:18 IST)
అసలే భారీ వర్షాలు, సునామీలు, తుఫానులతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఏకంగా 48 దేశాలు సముద్రంలో మునిగిపోయే రోజులు దగ్గరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ పరిణామాల కారణంగా భూమి వేడెక్కిపోతోందని.. మంచు గడ్డలు కరిగిపోతున్నాయి. తద్వారా సముద్రపు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. 
 
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పలు దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం అప్రమత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. కాగా ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న కీలక సమావేశంలో భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంపై కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇందులో భూమి ఉష్ణోగ్రతను దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు నియంత్రించాలని ఐరాస పేర్కొంది. తద్వారా 2050 నాటికి భూమి వేడెక్కడాన్ని చాలామటుకు తగ్గించుకోవచ్చునని ఐరాస సూచించింది. ఐరాస నిర్వహించిన ఈ సమావేశంలో ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, కెన్యా, శ్రీలంక వంటి దేశాలు పాల్గొన్నాయి.

వెబ్దునియా పై చదవండి