ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. గోదామును అక్రమంగా నిర్మించడం, అనుమతుల్లేకుండా రసాయనాలను దాచడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి.