జూ యజమానిపై దాడి చేసిన సింహం (వీడియో వైరల్)

గురువారం, 3 మే 2018 (09:53 IST)
దక్షిణాఫ్రికాలో ఒక జూ యజమానిపై సింహం దాడిచేసింది. ఈ దాడిలో ఆ యజమాని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత జూ సిబ్బంది అతన్ని సింహం బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్కులో ఈ ఘటన జరిగింద. ఆ జూ యజమాని మైక్ హాడ్జ్ ఓ సింహం ఎన్‌క్లోజర్లోకి వెళ్లాడు. ఆయనను చూసిన ఆ సింహం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చింది. ఆయన పరుగులు తీసినప్పటికీ సింహం ఆయన మెడపట్టుకుని లాక్కొచ్చింది. అనంతరం అతనిపై దాడి చేసింది. చివరకు ఆయనను జూ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు