అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు

బుధవారం, 27 జులై 2016 (10:22 IST)
అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారైంది. డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ అధికారికంగా నామినేషన్‌ వేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ రికార్టు సృష్టించారు. హిల్లరీ క్లింటన్‌ రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. 
 
అలాగే, రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నవంబరు నెలలో శ్వేతసౌథం అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి