పాకిస్తాన్‌లో హిందూ యువతికి ఉన్నత పదవి...

శనివారం, 8 మే 2021 (19:52 IST)
Hindu woman
పాకిస్తాన్‌లో ఓ హిందూ యువతికి ఉన్నత పదవి వరించింది. అక్కడ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాకిస్థాన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పాస్)కు ఎంపికైంది. 
 
పాకిస్థాన్‌లో ఈ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. పాక్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్‌ జిల్లాకు సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించింది.
 
ఈ సీఎస్‌ఎస్‌ పరీక్షకు 18,553 మంది హాజరవగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో సనా రామ్‌చంద్‌ ఒకరు. మన దేశంలో ఐయేఎస్ మాదిరిగా పాక్‌లో పాక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ ఉంటుంది. 
 
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో సనా అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రస్తుతం సింధ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్‌ చదువుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు