కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

ఐవీఆర్

శనివారం, 11 జనవరి 2025 (23:38 IST)
California Wildfires అమెరికా అంటే అందమైన జీవితం అనుకుంటూ ఎంతోమంది అక్కడికి వెళ్తుంటారు. ప్రపంచంలోని చాలా దేశాలలోని వారు అక్కడికి వెళ్లి జీవితం సాగించాలని కలలు కంటుంటారు. ఐతే ఇలాంటి కలలు కనేవారికి అమెరికాలో తాజాగా రేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించి ప్రకృతి విధ్వంసం ఎలా వుంటుందో చూపించింది. ఈ ధాటికి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దక్షిణ కాలిఫోర్నియాలో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ఇళ్లు, స్టూడియోలు కాలి బుగ్గి అయ్యాయి.
 
ఎన్నో అధునాతన కట్టడాలు కూడా మాడి మసైపోయాయి. అగ్రరాజ్యం అమెరికాలో రేగిన అగ్గి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమించినా అగ్నిదేవుడు తన ఆకలి పూర్తిగా తీర్చుకుని గాని శాంతించాడు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 10 వేల ఇళ్లు కాలిపోయి బూడిదయ్యాయి. సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి ఎంతటివారైనా తల వంచాల్సిందేనని అమెరికా కార్చిచ్చు తేటతెల్లం చేస్తోంది. 

మనిషి
చంద్రుడి పై నానా హంగామా చేస్తున్నాడు
కానీ భూమ్మీద అగ్ని దేవుడిని కంట్రోల్ చేయలేక చేతులేత్తేశాడు

Yes... Nature is brutual
He is the Hero...humans are villains
This is absolute cinema... pic.twitter.com/WSzsd2REb7

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) January 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు