టీవీ బాక్సులు, వాల్ సాకెట్లు, హెయిర్ డ్రయర్ హోల్డర్లలో వీటిని పెట్టి వీడియోలను ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో 4వేల మందికి పైగా వీక్షించారు. కొందరు డబ్బులు చెల్లించి మరీ రీప్లే చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దక్షిణకొరియాలో ఇలా సీక్రెట్ కెమెరాల కుంభకోణాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. అయితే వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం మాత్రం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. 2017 సంవత్సరంలో రహస్య కెమెరాలతో వీడియోల చిత్రీకరణపై 6,400 కేసులు నమోదయ్యాయి.