అన్నా.. ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి కార్యదర్శా? అతను వద్దనే వద్దు...

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:16 IST)
ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకా గాంధీ తన అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి ఓ విషయం తీసుకెళ్లారు. దీనిపై ఆయన తక్షణం స్పందించారు. ప్రియాంకాకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించిన వ్యక్తిని తొలగించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులయ్యారు. ఆమెకు ఏఐసీసీ కార్యదర్శిగా కుమార్‌ ఆశిష్ నేతను రాహుల్ నియమించారు. అయితే, 2005లో బిహార్‌లో పరీక్ష పేపరు లీక్‌ వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
దీంతో మేల్కొన్న ప్రియాంకా గాంధీ.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఆమె పరిశీలనలో కుమార్ అశిష్ 2005లో పరీక్ష పేపర్‌ను లీక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో వెంటనే కుమార్‌ను తొలగించాలని రాహుల్‌కు ప్రియాంక అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తన చెల్లి అభ్యర్థన మేరకు కుమార్‌ను తొలగించారు. కాగా, కుమార్‌ మంగళవారమే పార్టీలో మళ్లీ చేరారు. చేరిన తర్వాతి రోజే తొలగింపునకు గురికావడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు