భారత్, చైనా దేశాల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తూనే వుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల సైనికులు సరిహద్దుల వెంబడి ఘర్షణ పడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది.
కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో సరైన పంథాను అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కోసం భారత్ దృఢమైన విధానం అవలంభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.