భారత్ దెబ్బకు తోకముడిచిన యూకే : అంతర్జాతీయ కోర్టులో విక్టరీ

మంగళవారం, 21 నవంబరు 2017 (12:29 IST)
భారత్ దెబ్బకు బ్రిటన్ తోకముడిచింది. ఫలితంగా అంతర్జాతీయ కోర్టులో దౌత్య విజయం సాధించింది. ఫలితంగా భారత్ నామినేట్ చేసిన దల్వీర్ భండారీ మరోసారి ఐసీజేకు ఎన్నికయ్యారు. ఎలాగూ ఓటమి తప్పేలా లేదని భావించిన యూకే చివరి నిమిషంలో తమ అభ్యర్థి క్రిస్టొఫర్ గ్రీన్‌వుడ్‌ను తప్పించడంతో భండారీ విజయం సాధించారు. 
 
అసలు ఓటింగ్‌ను అడ్డుకుందామనే భావించిన యూకే.. జనరల్ అసెంబ్లీలోగానీ, అటు సెక్యూరిటీ కౌన్సిల్‌లోగానీ తమకు తగినంత మెజార్టీ లేదని తెలుసుకొని పక్కకు తప్పుకోవడం గమనార్హం. దీంతో 70 ఏళ్ల ఐక్య రాజ్య సమితి చరిత్రలో తొలిసారి యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఐసీజేలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 
 
అంతేకాదు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్ ఓ సాధారణ దేశం చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే, ఒక ఐసీజేలో ఓ సిట్టింగ్ సభ్యుడు మరో సిట్టింగ్ సభ్యుడి చేతిలో ఓడిపోవడం కూడా తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఏ రకంగా చూసినా.. ఇండియా సాధించిన అరుదైన దౌత్య విజయంగా చెప్పుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు