గూగుల్ మ్యాప్స్‌లో రియల్ టైమ్ కార్లు, బైకులు, ల్యాంప్ పోస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటివి కూడా 360 డిగ్రీ కెమెరాలతో చూడొచ్చు. దీనివల్ల లాభాలున్నా.. కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కోసారి ఈ యాప్, కొంపలు ముంచుతోంది. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన కొన్ని ఫొటోలను ఓ వ్యక్తి జాగ్రత్తగా చూశాడు. అందులో ఉన్నది తన భార్యేనని గుర్తించాడు.
కాకపోతే... పక్కన ఉన్న మగాడు మాత్రం తాను కాదు. దాంతో షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెరూ దేశానికి చెందిన అతను... రాజధాని లిమాలోని పాపులర్ బ్రిడ్జికి వెళ్లి... అక్కడ స్ట్రీట్ వ్యూ ఆన్ చేశాడు. రకరకాల రూట్లు తెలుసుకుందామనుకున్నాడు. కానీ అక్కడే అసలు విషయం తెలిసింది. అక్కడ తీసిన ఫోటోల్లో తన భార్య ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోందని తెలుసుకున్నాడు.
టీషర్ట్, బ్లూ జీన్స్‌లో వున్న వ్యక్తి.. అతని భార్య పక్కనే బెంచీపై పడుకున్నాడు. ఆ ఫొటోలు జూమ్ చెయ్యగా... ఆమె అతని తలపై జుట్టును నిమురుతోంది. ఆమె వేసుకున్న బట్టల్ని బట్టీ... ఆమె తన భార్యేనని గుర్తించాడు. దీంతో భార్యను భర్త నిలదీశాడు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. అదన్నమాట గూగుల్ మ్యాప్ కథ.