ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అత్యంత చలిగా ఉండే సైబీరియాలోని ఓమ్యాకోన్ గ్రామంలో -62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన థర్మామీటర్ పగిలిపోయింది. ఈ వారంలో చలి తీవ్రత పెరగడంతో థర్మామీటర్‌లో పగుళ్లు వచ్చాయని అక్కడి వాతావరణ అధికారులు వెల్లడించారు. అంటార్కిటికాకాకుండా ఇతర జనజీవన ప్రాంతాల్లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -67.7 డిగ్రీల సెల్సియస్ కావడం గమనార్హం.
ఉష్ణోగ్రతలు ఇలాగే పడిపోతే ఆ రికార్డును దాటే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అక్కడి ఉష్ణోగ్రతకి కనురెప్పల మీద ఉండే నీటి తుంపర కూడా మంచులా మారిపోతోంది. అక్కడి యకుస్కు గ్రామంలో నివసించే అనస్టేషియా అనే యువతి తీసుకున్న సెల్ఫీ చూస్తే అక్కడి చలి తీవ్రత అర్థమవుతోంది.