ప్రపంచంలోని ఉగ్రబాధిత దేశాల్లో భారత్ ఒకటని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, 'ఏ దేశమూ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయంగా మార్చకూడదు. ఉగ్రవాదంపై పోరాటమంటే మంచి చెడుల మధ్య పోరే' అని చెప్పుకొచ్చారు.
సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఇందులో దాదాపు 35 ముస్లిం మెజారిటీ దేశాధినేతలు హాజరైన ఈ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత ఒకటని ప్రస్తావించారు.
యూరప్, దక్షిణ అమెరికా, భారత, రష్యా, చైనా, ఆస్ట్రేలియాలు ఉగ్రవాదుల చేతుల్లో పదేపదే ఆటవిక దాడులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరును జాతుల మధ్య పోరుగానో, మత విశ్వాసాల మధ్య పోరుగానో భావించరాదని సూచించారు.