పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌లో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని సిక్కుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వాన్ని కోరింది.
గురునానక్ జన్మించిన పాకిస్థాన్‌లోని నాన్‌కానాలో ఉన్న నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై ఈ రాళ్లపై దాడి జరిగింది. దీంతో పాకిస్థానీ సిక్కులు భయంతో వణికిపోయారు. నాన్‌కానా సాహిబ్ గురుద్వారా పవిత్రతను కాపాడతామంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని పాక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రాళ్లదాడికి పాల్పడిన అల్లరి మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.