బూతు బొమ్మల వీక్షణలో భారతీయులే టాప్

శుక్రవారం, 3 జనవరి 2020 (12:47 IST)
బూతు బొమ్మల వీక్షణలో అమెరికా వాసులను భారతీయులు వెనక్కినెట్టేశారు. అమెరికా స్థానంలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో అమెరికా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్, జపాన్ దేశస్థులు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక నీలిచిత్రాలు వీక్షిస్తున్న వారి ప్రధాన సాధనం స్మార్ట్‌ఫోన్ అని ఈ సర్వే తేల్చింది. 
 
ప్రముఖ నీలి చిత్రాల వెబ్‌సైట్ పోర్న్ హబ్ ఇటీవల తన నివేదిక ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో భారత్‌కు అగ్రస్థానంలో నిలిచింది. భారత్ వీక్షకుల్లో 89 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు వీక్షిస్తున్నారని తేల్చింది. 81 శాతం అమెరికన్లు, 79 శాతంతో బ్రెజిలియన్లు, 74 శాతంతో జపనీయులు తర్వాత మూడు స్థానాల్లో ఉన్నారు.
 
ప్రపంచంలోని ప్రతి నలుగురు నీలి చిత్రాల వీక్షకుల్లో ముగ్గురు స్మార్ట్ ఫోన్లోనే చూస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లలో చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తేల్చింది. రహస్య వీక్షణకు స్మార్ట్ ఫోన్‌కు మించిన సాధనం లేకపోవడమే ఈ పెరుగుదలకు కారణమని గుర్తించింది. అలాగే, మొబైల్ డేటా వినియోగం నెలకు సగటున 9.8 జీబీ ఉందని, 2024 నాటికి ఇది 18 జీబీకి చేరుతుందని పలు సర్వేలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు