అమెరికాలో భారతీయ దంపతులను కాల్చిచంపిన కుమార్తె మాజీ బాయ్‌ఫ్రెండ్

ఆదివారం, 7 మే 2017 (13:27 IST)
అమెరికాలో భారతీయులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఈ దాడుల్లో ఓ దంపతుల జంటతో పాటు.. నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగినన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాలిఫోర్నియాలోని మొడెస్టోలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న జగ్జీత్ సింగ్ (32)ను దుకాణానికి వచ్చిన ఓ అమెరికన్ దూషిస్తూ, హత్య చేశారు. సిగరెట్ అడిగితే, గుర్తింపు కార్డును చూపాలని కోరినందుకు, జాతి దూషణలకు దిగిన సదరు వ్యక్తి ఆగ్రహంతో హెచ్చరిస్తూ వెళ్లిపోయాడు. ఆపై కాసేపటికి జగ్జీత్ సింగ్ దుకాణం బయటకు రాగా పదునైన కత్తి తీసుకుని దాడి చేశాడు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మరణించారు.
 
అలాగే, ఇంకో ఘటనలో కేరళకు చెందిన రమేష్ కుమార్ అనే డాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే తుపాకితో కాల్చి హత్య చేశారు. మరో ఘటనలో సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న నరేన్ ప్రభు దంపతుల కుమార్తె ప్రేమ వ్యవహారం వారి ప్రాణాలను తీసింది. వారి కుమార్తెతో కొంతకాలం ప్రేమాయణం సాగించిన మీర్జా టాట్లిక్ అనే 24 సంవత్సరాల యువకుడు, వారి ఇంట్లోనే నరేన్ ప్రభు, అతని భార్యపై కాల్పులకు దిగి హత్య చేశాడు. ఆపై పోలీసులతో గొడవ పడి, వారి కాల్పుల్లో మరణించాడు. 

వెబ్దునియా పై చదవండి