పాకిస్థాన్ కుట్ర.. ఆ యాప్ ద్వారా ఆర్మీ అధికారుల ఫోన్ హ్యాక్‌ చేస్తుందా?

గురువారం, 30 ఏప్రియల్ 2020 (19:14 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఇందుకు కారణంగా ఉగ్రవాదులకు పాక్ వంత పాడటం.. సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘన కారణంగా భారత్-పాకిస్థాన్‍‌ల మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసింది. క్రికెట్ సిరీస్‌తో పాటు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరని తరుణంలో.. భారత్‌పై పాక్ కుట్రలు చేస్తోంది. 
 
ఇందులో భాగంగా తాజాగా పాకిస్తాన్‌ భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్‌లు హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని ఇండియన్‌ ఆర్మీ అధికారులను హెచ్చరించింది. కరోనా మహమ్మారి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని అందరూ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కోరింది. 
 
అయితే ఈ యాప్ ద్వారా పాకిస్థాన్ భారత సైన్యానికి సంబంధించిన విషయాలను హ్యాక్‌ చేయాలని చూస్తోంది. ఆరోగ్యసేతు యాప్‌లాగా ఉండే మరో యాప్‌ను పాకిస్థాన్ వర్గాలు తయారు చేసి.. వీటిని భారత ఆర్మీ స్టాప్‌కి వాటాప్స్‌ ద్వారా ఆరోగ్య సేతు పేరుతో పంపిస్తున్నాయి. 
 
దీనిని వారి ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన ఆర్మీ విషయాలు పాకిస్తాన్‌ వారు సులభంగా తెలుసుకోగలుగుతారు. భారత్‌కు చెందిన పేర్లతో సోషల్‌ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తూ ఆర్మీ వారిని పాకిస్తాన్‌ టార్గెట్‌ చేస్తోంది. ఇప్పటికే అనోష్క చోప్రా పేరుతో ఆర్మీ ఆఫీసర్‌కి ఒక రిక్వేస్ట్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు