మహేష్ బాబుకు ప్రముఖులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఒకటైతే, రాజమౌళి చెప్పడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా అప్ డేట్ గురించి అభిమానులతోపాటు సినీఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకే రాజమౌళి ఎక్స్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. దీనిని చూశాక అభిమానులు మరింత ఆసక్తి కోసం నవంబర్ వరకు ఆగాల్సిందేనా అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.