ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాయగా, ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసి సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. 'ఓనమ్' లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే - ' ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా, ఫోనే మార్చేశానే, ఛాటింగ్ ఆపేశానే, నీకే సింక్ అయ్యానే వదలను ఇల్లా..వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే, లెఫ్టే ఉన్న గుండె రైటు రైటందే...' అంటూ మాస్ మెలొడీతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. కేరళ పండుగ ఓనమ్ సందడి అంతా ఈ పాటలో కనిపించింది. 'ఓనమ్' పాటలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా మాస్ స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.