మరో సర్జికల్ దాడికి సిద్ధమవుతున్న భారత్.. పాకిస్థాన్ రెచ్చిపోతుందా?

శనివారం, 8 అక్టోబరు 2016 (11:52 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరో సర్జికల్ దాడికి భారత్ సిద్ధమవుతోంది. యురీలోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రతీకార చర్యగా భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌ చేసి పదుల సంఖ్యలో తీవ్రవాదులను హతమార్చింది. 
 
ఈ దాడులతో పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన భారత్... మరోసారి అదే తరహా దాడులకు సిద్ధమవుతోందా? సరిహద్దులోని పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. సరిహద్దుకు అవతల ఉన్న గ్రామాల్లోని ప్రజలను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. 
 
భారత్ ఏ క్షణంలోనైనా మరోసారి సర్జికల్ దాడులకు దిగే అవకాశం ఉందన్న అనుమానంతోనే పాక్ ఈ చర్యలు చేపట్టింది. భారత్ చేపట్టే సర్జికల్ దాడులను ఈ సారి సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, ప్రతి దాడులకు దిగాలని పాక్ సైన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి