భారత సంతతి కెనడా పౌరురాలు మన్‌ప్రీత్ కూనర్ ట్రంప్ బారిన పడ్డారా? అవునంటున్నారు అమెరికన్ బోర్డర్ ఏెజెంట్. కెనడా నుంచి అమెరికాకు ప్రయాణమైన కూనర్‌ని క్విబె్క్-వెర్మాంట్ సరిహద్దు వద్ద అడ్డుకున్న అమెరికా సరిహద్దు నిఘా అధికార్లు ఆరుగంటలు శల్యపరీక్ష చేసిన తర్వాత మీకు ప్రవేశం లేదు అంటూ చావుకబురు చల్లగా చెప్పేశారు. పైగా యు హేవ్ బీన్ ట్రంప్డ్ అంటూ పరిహసించారు.
భారతీయురాలైన మన్ ప్రీత్ కూనర్ ప్రస్తుతం కెనడా పౌరురాలిగా మాంట్రియల్‌లో ఉంటున్నారు. గత ఆదివారం అమెరికాకు బయలు దేరిన తనను రెండు దేశాల సరిహద్దు ప్రాంతమైన క్విబెక్-వెర్మాట్ సరిహద్దు వద్ద బోర్డ్రర్ ఏజెంట్లు అడ్డుకున్నారని, తన వేలిముద్రలు తీసుకుని, ఫోటో తీశారని, ఆరుగంటల నిరీక్షణలో ఉంచి తర్వాత అమెరికాకు తనకు ప్రవేశం లేదని చెప్పి తిప్పి పంపించేశారని కూనర్ చెప్పారు.