అమెరికా స్టోర్‌లో కాల్పులు... భారత సంతతి వ్యక్తి మృతి

ఠాగూర్

ఆదివారం, 18 ఆగస్టు 2024 (11:33 IST)
అమెరికాలో ఓ స్టోర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నార్త్ కరోలినాలోని అతని కన్వీనియన్స్ స్టోరులోనే ఈ ఘటన జరిగింది. మృతుడిని మైనాక్ పటేల్‌గా గుర్తించారు. సాలిస్‌బరీ కథనం మేరకు... 2580 ఎయిర్ పోర్ట్ రోడ్డులోని టుబాకో హౌస్ యజమాని పటేల్‌పై మంగళవారం దాడి జరిగింది.
 
ఈ కాల్పుల ఘటన తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన పటేల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంది. అతను మైనర్ కావడంతో పేరును వెల్లడించలేదు. నిందితుడిని మంగళవారం రోజే పోలీసులు అరెస్టు చేశారు.
 
టుబాకో హౌస్ స్టోర్ నుంచి కాల్పులకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చిందని రోవాన్ కంట్రీ షెరీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్ డానియల్ వెల్లడించారు. పోలీసులు అక్కడకు చేరుకొని... గాయాలతో బాధపడుతున్న పటేల్‌ను చూశారు. వెంటనే అతనిని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి చార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు