భారతీయుడిపై పేలిన తుపాకీ.. సమీర్ పరిస్థితి విషమం.. అట్లాంటాలో ఘోరం..

గురువారం, 15 జూన్ 2017 (10:55 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఇతర దేశస్థులకు రక్షణ కరువైంది. కూచిబొట్ల శ్రీనివాస్ తరహా ఘటన మరవక ముందే... అమెరికాలో మరో భారతీయుడిపై తుపాకీ పేలింది. దుకాణంలో దొంగతనానికి వచ్చిన ముష్కరులు సమీర్‌ హస్‌ముఖ్‌ పటేల్‌ను తుపాకీతో కాల్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాకు చెందిన సమీర్‌ హస్‌ముఖ్‌ పటేల్‌(24) అనే యువకుడు అట్లాంటాలో ఓ షాపులో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పొద్దుపోయాక దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతుండగా, ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. వచ్చీ రాగానే సమీర్‌పై కాల్పులు జరిపారు. 
 
బుల్లెట్‌ దెబ్బకు తీవ్రంగా గాయపడిన సమీర్‌ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు. ఆ తర్వాత.. దొంగలు షాప్‌లో నగదుతో పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమీర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి