Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

దేవీ

గురువారం, 28 ఆగస్టు 2025 (15:11 IST)
Vishal Makutham poster
విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న చిత్రం మకుటం. అంజలి, దుషార విజయన్ నాయికలుగా నటిస్తున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రం. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.
 
ఇక తాజాగా మకుటం నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు. 
 
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
 తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు