Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

దేవీ

గురువారం, 28 ఆగస్టు 2025 (14:53 IST)
Maman poster
భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో మామ‌న్‌ ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఆగ‌స్ట్ 8న త‌మిళంలో ZEE 5 ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఆగ‌స్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కులను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండ‌టంతో మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది.
 
ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక‌)క‌కు పెళ్లై ప‌దేళ్లైనా పిల్ల‌లు పుట్టారు. గిరిజ మొక్క‌ని దేవుడు లేడు. చివ‌ర‌కు ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిస్తుంది. లేక లేక పుట్టిన మేన‌ల్లుడు నిల‌న్ (ప్ర‌గీత్ శివ‌న్‌) అంటే ఇన్‌బాకు అమిత‌మైన ప్రేమ‌. త‌న‌ను ప్రేమ‌గా ల‌డ్డు అని పిలుచుకుంటుంటాడు. ఇన్‌బా, రేఖ‌ను పెళ్లి చేసుకుంటాడు. ల‌డ్డుకి మామ అంటే ఉండే ప్రేమ‌తో అత‌నితోనే ఉంటాడు. ఇది రేఖ‌కు న‌చ్చ‌దు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది. చివ‌ర‌కు ల‌డ్డు వ‌ల్ల ఇన్‌బా, రేఖ విడిపోతారా? ఇన్‌బాపై నిల‌న్‌కు ఉన్న ప్రేమ‌ను రేఖ అర్థం చేసుకుంటుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘మామ‌న్‌’ సినిమాను చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు