కానీ ఇజ్రాయిల్ దేశంలో ఈ ఏడాది కరోనా నిబంధనలు తొలగించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మతగురువుకు నివాళ్లు అర్పించేందుకు వచ్చారు. వీరంతా ఆనందంలో డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా షెడ్‌పై కప్పు కూలినట్లు స్థానిక మీడియా చెబుతుంది. ఈ నేపథ్యంలోనే బయటకు వెళ్లేందుకు పరుగులు తియ్యగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు.
అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సఫెడ్‌లోని జివ్ హాస్పిటల్, నహరియాలోని గెలీలీ మెడికల్ సెంటర్, హైఫాలోని రాంబం హాస్పిటల్, టెబెరియాస్‌లోని పోరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దుర్ఘటనను ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు.