గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం

మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:33 IST)
పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన గాజాలో మరోమారు బాంబుల మోత మోగుతోంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధ తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 యేళ్ళ బాలికతో పాటు.. 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని గాజా అధికారులు వెల్లడించారు. 
 
దీంతో గాజాకు చెందిన అనేక మంది సరిహద్దు ప్రాంతంలో గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా దిగ్బంధాన్ని నిరసిస్తూ గాజా పౌరులు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఒక సరిహద్దు దళ విభాగం పోలీసు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ సేనలు గాజాలోని 4 ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు