#GES2017 మీ ఆతిథ్యం చెరిగిపోని జ్ఞాపకం... ఇవాంక

గురువారం, 30 నవంబరు 2017 (12:58 IST)
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో భాగ్యనగరంలో ఆమె ఆతిథ్యం పొందారు. ఆ తర్వాత బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి నేరుగా దుబాయ్‌కు వెళ్లారు.
 
ఈ పర్యటన ముగించుకున్న తర్వాత ఇవాంకా తన ట్విట్టర్ ఖాతాలో తనదైన శైలిలోస్పందించారు. తన హైదరాబాద్ టూర్ మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిందన్నారు. ఆద్యంతం ఉల్లాసంగా, అద్భుతంగా సాగిందన్నారు. 'హైదరాబాద్‌ నుంచి తిరిగి బయలుదేరేముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్‌ ఎండ్‌ టు ఏ రిమార్కబుల్‌ విజిట్‌)' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, ఈ సదస్సు కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె హోటల్ ట్రైడెంట్ హోటల్‌లో రెండు రోజుల పాటు బస చేశారు. అలాగే, 28వ తేదీ రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందులో ఆమె పాల్గొని భారతీయ వంటకాలను రుచిచూశారు. 
 
మరుసటి రోజైన బుధవారం నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. మొత్తానికి తన నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్టుగా నిరాడంబర స్వభావంతో జీఈఎస్ సదస్సులో ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
 

Tour of Golkonda Fort with members of the US delegation prior to departing Hyderabad. The perfect end to a remarkable visit. #GES2017 pic.twitter.com/HNYeBe4FdB

— Ivanka Trump (@IvankaTrump) November 29, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు