జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ అరెస్ట్!

సోమవారం, 18 ఆగస్టు 2014 (16:48 IST)
హాలీవుడ్ సూపర్ స్టార్, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్‌ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు.
 
సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్‌గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో అతని స్నేహితుడు, తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్‌తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. 
 
అయితే పోలీసులు అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్నది మాత్రం వెల్లడికాలేదు. కానీ చైనా మీడియా తాజాగా ఈ విషయాన్ని సోమవారం బయటపెట్టింది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ హీరో కామెంట్లు గత మంగళవారం నుంచి వెలుగుచూడలేదు.

వెబ్దునియా పై చదవండి