గత వారం రహస్య విచారణ జరిపిన అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో సోమవారం ఆయన లండన్ జైలు నుంచి విడుదలయ్యారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత అమెరికా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని పొందారు. అమెరికా న్యాయవిభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అసాంజే.. కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, ప్రచురించడం వంటి నేరాలకు పాల్పడినట్టు ప్రకటించారు.
సుమారు మూడు గంటల పాటు వాదనలు విన్న జడ్జి రమోనా వి మంగ్లోనా ఈ నేర అంగీకారాన్ని ఆమోదించారు. లండన్ జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా అదనపు శిక్ష అవసరం లేదని తెలిపారు. అనంతరం అసాంజే ప్రత్యేక విమానంలో అమెరికా, బ్రిటన్‌ల్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్‌బెర్రా చేరుకున్నారు.