1990 దశకంలో అతని నేతృత్వంలోని సైన్యం వందలాది మందిని హతమార్చాడు. చిన్నారులను సైనికులుగా మార్చడమే కాకుండా.. బహిరంగంగా మహిళపై అత్యాచారాలు, హత్యలు చేశాడు. 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయి... అక్కడే సెటిలయ్యాడు.
ఫిలడెల్ఫియాలో బిజినెస్ మ్యాన్‌గా స్థిరపడ్డాడు. ఆపై 15 సంవత్సరాల తర్వాత యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. సాక్ష్యాధారాలు కూడా బలంగా వుండటంతో అతనికి కఠిన కారాగార శిక్ష ఖాయమని తెలుస్తోంది. గురువారం అతనికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో జబ్బతెహ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.