శనివారం రాత్రి 9 గంటలకు నలుగురు సాయుధులు హోటల్‌లోకి ప్రవేశించారు. అత్యాధునిక ఆయుధాలతోపాటు రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లతో దాడి చేశారు. ముంబై ముట్టడి తరహాలో దానిని తమ ఆధీనంలోకి తీసుకుని విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. కొంతమందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్‌లోని కొన్ని ఫ్లోర్లకు నిప్పు పెట్టారు.