ప్రేమికులు గాఢచుంబనంతో జాగ్రత్తగా వుండాలట.. లేకుంటే?

గురువారం, 31 ఆగస్టు 2023 (10:42 IST)
ఆగస్టు 22న చైనా వేలంటైన్స్ డే నాడు జరిగిన ఘటనతో గర్ల్ ఫ్రెండ్స్‌కు ముద్దుపెట్టాలంటేనే జనం జడుసుకుంటున్నారు. చైనాలోని ఓ కుర్రాడికి ఎదురైన వింత అనుభవం ఎదురైంది. గాఢ చుంబనం వలన చెవిలో గాలి పీడనంలో కర్ణభేరి పగిలిపోయి వినికిడి సమస్య ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను పదినిమిషాలపాటు ముద్దుపెట్టుకున్నాడు. 
 
అంతే చెవులు వినిపించడం మానేశాయి. ఆగస్టు 22న చైనా వేలంటైన్స్ డే నాడు వెస్ట్‌లేక్‌లో ఓ జంట ప్రేమ మైకంలో మునిగిపోయి అదర చుంబనాలతో ప్రపంచాన్ని మర్చిపోయింది. అయితే పది నిమిషాల తర్వాత ఆ కుర్రాడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఎడమ చెవిలో నొప్పుగా ఉందని, చెవి నుంచి భయంకరమైన శబ్దం వస్తోందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
పరీక్షించిన వైద్యులు అతడి కర్ణభేరి పగిలిపోయినట్టు గుర్తించారు. ఉద్వేగభరితమైన అదర చుంబనం చెవి లోపల గాలి పీడనంలో వేగంగా మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. భాగస్వామి శ్వాసతో కలిసి కర్ణభేరీ పగిలే ఛాన్సుందని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి గాఢచుంబనంతో ప్రేమికులు కాస్త జాగ్రత్తగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు